అయ్యో.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఎంతంటే

Updated on: Oct 31, 2025 | 4:29 PM

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊహకందరని రీతిలో పసిడి పరుగెడుతోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ బంగారం కొనాలా ఇంకా తగ్గేదాకా ఆగుదామా అనే సందేహంలోకి వచ్చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయన ఏ నిర్ణయం తీసుకున్నా అది బంగారం ధరల మీద ప్రభావం చూపుతోంది.

అక్టోబరు 31 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగి రూ. 1,22,680 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 పెరిగి రూ.1,12,450 పలుకుతోంది. ఇక స్థిరంగా కొనసాగుతున్న కిలో వెండి ధర రూ.1,65,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,830 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,600 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,22,680, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,280, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,000 గా కొనసాగుతోంది.కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,22,680, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,450 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,22,680, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,65,000 గా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటల తర్వాత నమోదైనవి. సాయంత్రానికి బంగారం ధరల్లో హెచ్చతగ్గులు ఉండొచ్చు. కనుక బంగారం కొనేందుకు వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి పేరుతో వ్యాపారాలా ?? తీవ్ర ఆగ్రహం

ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న బ్యూటీస్‌

Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్‌ రివ్యూ ఇచ్చిన గౌతమ్‌

Toxic: టాక్సిక్‌ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??

రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్‌