ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాల మధ్య రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రాబోయే ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పాపటపల్లి – డోర్నకల్ బైపాస్ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.
10 రైళ్లు.. ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులు పాటు రద్దుచేసినట్లు పేర్కొంది.. ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు.. డోర్నకల్- విజయవాడ, విజయవాడ- డోర్నకల్ రైలు రద్దు చేయబడింది. కాజీపేట- డోర్నకల్ , డోర్నకల్- కాజీపేట , విజయవాడ- సికింద్రాబాద్, సికింద్రాబాద్- విజయవాడ, విజయవాడ- భద్రాచలం రోడ్ , భద్రాచలం రోడ్- విజయవాడ, గుంటూరు- సికింద్రాబాద్, సికింద్రాబాద్- గుంటూరు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు.. మరో 26 రైళ్లలో కొన్నింటిని ఒక రోజు, మరికొన్నింటిని రెండు రోజుల పాటు రద్దు చేశారు. దాదాపు తొమ్మిది రైళ్లను దారి మళ్లించనున్నారు. ఇంకో మూడు రైళ్లు ఆలస్యంగా బయల్దేరతాయని.. రెండు రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఏమైనా సందేహాలుంటే.. సహాయం కోసం 139 డయల్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్
ఎట్టకేలకు అసలు బడ్జెట్ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్
మహేష్‌తో నటించేందుకు నో చెప్పిన.. మెగా హీరో
300 కోట్ల దిశగా.. మహావతార్ నరసింహ మూవీ
కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్ నాగార్జునతోనే…