జియో,ఎయిర్‌టెల్‌కు BSNL షాక్..

Updated on: Aug 29, 2025 | 1:57 PM

ఇటీవల టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను పెంచుతూ పోతున్నాయి. కనీస రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలను సవరించడమే కాకుండా.. కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

కేవలం రూ.147కే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే.. రూ.147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందొచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు. పెరుగుతున్న రీఛార్జ్ ధరల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..

కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం

శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్‌ ఊహించనంత ఎత్తుకే

వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు