కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..
కొత్త కారు గానీ, బైక్‌గానీ కొనుక్కునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్తా ఆగండి.. ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత ఎప్పుడు కొనాలనేది డిసైడ్ అవ్వండి. ఈనెల 22 తర్వాత కార్లు, బైక్‌లు సహా పలు రకాల వాహనాల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించే చిన్న, మధ్యతరహా కార్లపై రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు మిగలనున్నాయి.
అయితే జీఎస్టీ మార్పుతో కొన్నికార్ల ధరలు పెరుగుతాయని, ఇప్పుడే కొనుక్కోండి అని కొందరు డీలర్లు గందరగోళానికి గురిచేస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్టీలో పెను మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి మేలు చేసేలా సవరణలు చేయబోతున్నామని ప్రధాని మోదీ చెప్పినట్లుగా.. జీఎస్టీ స్లాబులు మారాయి. ఇప్పటివరకు 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు రెండే స్లాబులుగా మారింది. ఇకపై 18, 5 శాతం మాత్రమే ఉంటాయని చెప్పింది కేంద్రం. 28, 12 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో 18 శాతం, 5శాతం జీఎస్టీ తీసుకొచ్చింది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కాబోతుంది. వాహనాల రేట్లు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారిలో నెలకొంది. వాహన రంగంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గించింది కేంద్రం. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, 1200 సీసీలోపు ఉన్న LPG, CNG కార్లపై GST 28 నుంచి 18 శాతానికి తగ్గనుంది. ఇక డీజిల్, 1200 సీసీలోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్ కూడా 18 శాతానికి తగ్గుతాయి. 350 CC వరకు ఉన్న బైక్‌లు, మినీలారీలు, DCMలు ట్రాలీఆటోలపై జీఎస్టీ 18 శాతానికి తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గించింది కేంద్రం. ఇది అమల్లోకి వస్తే ఈవీ వెహికిల్స్ అయిన టూవీలర్లపై 5 నుంచి 10వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. త్రీ వీలర్లపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గించారు. అంటే ఈవీ ఆటోలపై కూడా 10 నుంచి 20వేల వరకు ఆదా అవ్వనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది
నాన్ ఏసీలో.. ఏసీ ఎఫెక్ట్.. ఐడియా అదిరింది భయ్యా
తాళి కట్టాలంటే చర్నాకోల దెబ్బలు తినాల్సిందే..!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

