AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది

Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది

Phani CH
|

Updated on: Sep 08, 2025 | 7:12 PM

Share

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు రైతులను, అటు ప్రజల్ని భయపెడుతున్న ఏనుగుల సమస్యకు చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏనుగుల కదలికలపై ముందస్తు సమాచారం కోసం అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఆర్టీజీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏనుగుల కదలికలను ముందే గుర్తించనుంది.

అడవిలోని ఏనుగులు గ్రామాల్లోకి చొరబడే క్రమంలో కిలోమీటర్ దూరంలో ఉండగానే అలెర్ట్ చేసే టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏనుగులు వస్తున్నాయి జాగ్రత్త అంటూ మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపనున్న ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ప్రజల్ని అప్రమత్తం చేయబోతోంది. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ నిరంతర నిఘా కొనసాగించబోతోంది. గతంలో పొలాలను ధ్వంసం చేస్తూ..మనుషులపై దాడులు చేస్తూ రైతులకు కన్నీటిని మిగిల్చుతున్న ఏనుగులకు చెక్‌ పెట్టేందుకు కేరళనుంచి కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. ఇప్పడు మరో అడుగు ముందుకు వేసి ఏనుగుల దాడులకు చెక్‌ పెట్టేందుకు సాంకేతితకను వినియోగించాలని నిర్ణియించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన అటవీ శాఖ అధికారులు ఏనుగుల ఘర్షణ నివారణకు సంయుక్తంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని బయో ల్యాబ్ లో నిరంతర పర్యవేక్షణ తో పాటు డ్రోన్లు, జిపిఎస్ పరికరాలు ఉపయోగించి డేటా సేకరిస్తున్న అటవీశాఖ, గూగుల్ టెక్నాలజీతో ఏనుగుల కదలికలను అంచనా వేస్తోంది. ఎలిఫెంట్ సేఫ్ డ్రైవ్ ఆడిట్ ద్వారా పారదర్శకమైన జియో రెఫరెన్స్ తో కూడిన నివేదికలను తయారు చేస్తోంది. మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణ నివారణకు కమ్యూనిటీ ఆధారిత విధానాలను అవలంబిస్తోంది.ఏనుగుల కదలికలను వాట్సాప్, లౌడ్ స్పీకర్లతో సమాచారం అందిస్తున్న అటవీశాఖ పంచాయితీ, పోలీసు రెవెన్యూ విద్యుత్ రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుంటుంది. ఇకపై మొబైల్ అలర్ట్ తో పాటు , థర్మల్ సెన్సార్లతో కూడిన సోలార్ పవర్ స్మార్ట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. SMS, GPS ఆధారిత వ్యవస్థలను కూడా వినియోగించనున్న అటవీశాఖ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ఒక్క ఏనుగులపైనే కాదు, తిరుమల భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతల సంచారంపైనా ప్రత్యేకంగా నిఘా ఉంచింది అటవీశాఖ. ఇక శేషాచలం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల పర్యవేక్షణ ఘర్షణ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తుల భద్రత తో పాటు వన్య ప్రాణుల సంరక్షణ పై అటవీ శాఖ దృష్టి పెట్టింది. చిరుతలు, ఏనుగులు ఇతర వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గంలో 100 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేసింది. 30 చోట్ల సోలార్ పవర్ తో లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని అమలు చేయనున్న అటవీ శాఖ డ్రోన్ ల తోనూ పర్యవేక్షణ చేయబోతోంది. కేజ్ ట్రాప్ లను అమర్చడంతో పాటు నిరంతర నిఘా ఉంచబోతోంది. మరోవైవు తిరుమల కొండలలో పచ్చదనం పెంపుకు కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఉన్న 64.14 శాతం ఉన్న అడవి కవచాన్ని 2027-28 నాటికి 80 శాతం పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. టీటీడీకి చెందిన 3 వేల హెక్టార్లు, రిజర్వ్ ఫారెస్ట్ లోని 7 వేల హెక్టార్లలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ 10.50 కోట్లు నిధులు ఖర్చు చేయనున్న అటవీ శాఖ ఈ మేరకు దీర్ఘకాలిక పర్యావరణ భద్రతకు చర్యలకు శ్రీకారం చుట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్‌ ఏసీలో.. ఏసీ ఎఫెక్ట్‌.. ఐడియా అదిరింది భయ్యా

తాళి కట్టాలంటే చర్నాకోల దెబ్బలు తినాల్సిందే..!

క్షణక్షణం..భయం భయం.. చేతబడులతో వణికిపోతున్న గ్రామం

ఆ పనిమనిషి చేసిన పనికి సోషల్‌ మీడియా షేక్‌

ఇక.. ఇండియాలో ఇంద్రధనస్సు కనబడదా? వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు