అంబానీని మించిన అదాని.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడుగా అదాని.. ఎందులోనో తెలుసా! వీడియో

|

Oct 06, 2021 | 8:31 AM

ముఖేష్‌ అంబానీని దాటి దూసుకుపోతున్నారు అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ. ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడుగా నిలిచిన అదానీ, గత ఏడాది సంపాదన ఎంతో తెలుసా..?

YouTube video player

ముఖేష్‌ అంబానీని దాటి దూసుకుపోతున్నారు అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ. ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడుగా నిలిచిన అదానీ, గత ఏడాది సంపాదన ఎంతో తెలుసా..? రోజుకు 1,002 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం అతని ఆస్తులు 5.05 లక్షల కోట్లు. సంవత్సరం క్రితం, ఆయన ఆస్తులు 1.40 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడు 5.05 లక్షల కోట్లకు చేరింది. ముఖేష్ అంబానీ కుటుంబం భారతదేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో ఒకటి. ఆయన గత ఏడాది రోజుకు163 కోట్లు సంపాదించగా..ఆయన సంపద 9 శాతం పెరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్తులు 7.18 లక్షల కోట్లు. అంబానీతో పోలిస్తే, గత ఏడాది అదానీ రోజుకు 6 సార్లు కంటే ఎక్కువ సంపాదించారు. దాంతో అదానీ సంపద 4 రెట్లు పెరిగింది. ఈ కారణంగా, 59 ఏళ్ల అదానీ మళ్లీ ఆసియాలో రెండవ ధనవంతుడైన వ్యాపారవేత్తగా నిలిచారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: జీన్స్‌, టీషర్ట్స్‌ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. వీడియో

చిన్నవయసులోనే జుట్టు ఎందుకు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి! వీడియో

Published on: Oct 06, 2021 08:30 AM