గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

|

May 02, 2024 | 9:56 PM

వినియోగదారులకు ఒకటో తేదీ కాస్త ఊరట లభించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ను తగ్గిస్తూ ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు నిర్ణయం తీసుకు‌న్నాయి. ఈ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండరుపై రూ.19లు తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి.

వినియోగదారులకు ఒకటో తేదీ కాస్త ఊరట లభించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ను తగ్గిస్తూ ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు నిర్ణయం తీసుకు‌న్నాయి. ఈ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండరుపై రూ.19లు తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. మే1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు తెలిపాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం తగ్గించిన ధరలతో ప్రధాన నగరాల్లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర రూ.1745.50కి అందుబాటులో ఉంటుంది. కోల్‌కతాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1859లుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1994.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.855 వద్ధ స్థిరంగా కొనసాగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోటి పూతేగా అని లైట్ తీసుకోవద్దు.. ఆలస్యం చేస్తే డేంజర్‌

నమ్మలేని నిజం.. మనిషి ఒంట్లో బంగారం

బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మే నెలలో సెలవులే సెలవులు !!

కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్‌..

ప్రధాని మోదీని పోలిన పానీపూరీ వాలా.. ఆశ్చర్యపోతున్న జనం