పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ నుంచి డిప్లొమా వరకూ అందరూ అర్హులే

|

Dec 13, 2024 | 4:45 PM

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య ఇంకా కొందరికి అందని ద్రాక్షలాగే ఉంది. తపన ఉండీ ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోతున్నపేద విద్యార్ధులు ఎందరో. అలాగే ప్రతిభ ఉండి కూడా పేదరికం వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్న వారూ ఎందరో. అలాంటి యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది.

గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2024 పేరుతో ఉపకారవేతనాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్‌ 22, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో లేదా తత్సమానమైన సీజీపీఏ గ్రేడ్‌తో ఉత్తీర్ణత పొందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో విద్యను పూర్తి చేసిన విద్యార్ధులు ఈ స్కాలర్‌షిష్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2024 -25లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందిన, పొందాలనుకునే బాల, బాలికలకు జనరల్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఏదైనా విభాగంలో డిప్లొమా చేయాలనుకుంటున్న, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్‌ కోర్సులు, ఐటీఐ చదవాలనుకున్న వారికి ఈ పథకం ద్వారా స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆధార్‌ లా ఇక అపార్‌ కార్డు.. ఇది ఎవరికోసం అంటే ??

ఆ క్రిస్మస్ లింక్ ఓపెన్ చేస్తే.. నిలువుదోపిడీయే !!

TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్‌ రికార్డ్‌ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో.. రజినీ మాస్టర్ ప్లాన్