Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో

Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో

Phani CH

|

Updated on: Nov 05, 2021 | 7:08 PM

ఉన్నత విద్య కోసం మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇలా విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు, ఎక్సేంజ్‌ మార్క్‌అప్‌ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడి చేస్తున్నాయి.

ఉన్నత విద్య కోసం మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇలా విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు, ఎక్సేంజ్‌ మార్క్‌అప్‌ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ అనే ఇండిపెండెంట్‌ రీసెర్చ్‌ సంస్థ బయట పెట్టింది. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట బ్యాంక్‌లు భారీ దోపిడికి పాల్పడుతున్నాయి. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను లెక్కాపత్రం లేకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించే వారు లేకపోవడంతో శ్రమ జీవుల సంపాదనను జలగల్లా పీల్చేస్తున్నారు బ్యాంకర్లు. విదేశాల్లో ఉన్న తమ వారి కోసం భారతీయులు పెద్ద ఎత్తున నగదును పంపిస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం 12.7 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు 95 వేల కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా 3.8 బిలియన్‌ డాలర్లు ఉన్నత విద్య కోసం వెచ్చిస్తుండగా ఆ తర్వాత ట్రావెల్‌కు 3.2 బిలియన్‌, ఫ్యామిలీ సపోర్ట్‌ 2.7 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో

Coronavirus: కరోనా కమ్ముకోస్తోంది తస్మాత్‌ జాగ్రత్త.. లైవ్ వీడియో