Stock Markets: హాంగ్ కాంగ్ ను వెనక్కి నెట్టి.! నాలుగో స్థానానికి భారత స్టాక్ మార్కెట్.
భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యధిక ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది. భారత్ ఈ స్థానాన్ని అందుకోవటం ఇదే తొలిసారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం భారతీయ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన షేర్ల సంయుక్త విలువ సోమవారం నాటికి USD 4.33 ట్రిలియన్‌లకు చేరుకుంది. ఇదే సమయంలో హాంకాంగ్‌ది USD 4.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యధిక ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది. భారత్ ఈ స్థానాన్ని అందుకోవటం ఇదే తొలిసారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం భారతీయ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన షేర్ల సంయుక్త విలువ సోమవారం నాటికి USD 4.33 ట్రిలియన్‌లకు చేరుకుంది. ఇదే సమయంలో హాంకాంగ్‌ది USD 4.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2023 డిసెంబర్ 5న తొలిసారిగా 4 ట్రిలియన్‌లను దాటింది. భారత్ కంటే ముందు మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్ ఉన్నాయి. అమెరికా 50.86 ట్రిలియన్ డాలర్లతో తొలిస్థానంలో ఉండగా, 8.44 ట్రిలియన్ డాలర్లతో చైనా, 6.3 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఇన్‌ఫ్లోలు, బలమైన కార్పొరేట్ ఆదాయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

