Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌లో అవయవ దానానికి ఏ రైడర్స్ బెస్ట్

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌లో అవయవ దానానికి ఏ రైడర్స్ బెస్ట్

Subhash Goud

|

Updated on: Jan 24, 2024 | 7:52 PM

సగటున, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, కిడ్నీ మార్పిడి చికిత్సకు మీకు దాదాపు రూ. 15 లక్షల మేర ఖర్చవుతుంది. గుండె మార్పిడికి మీకు రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. కాలేయ మార్పిడికి కూడా రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందు కోసం బీమా పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి ఖరీదైన చికిత్స సమయంలో బీమా పాలసీ అండగా నిలుస్తుంది. మరి ఎలాంటి పాలసీ తీసుకుంటే మంచిదో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..

భారతదేశ అవయవ దానం రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. 10 లక్షల మంది వ్యక్తులకు కేవలం 0.86 చొప్పునే ఉంది. 2023 నాటికి భారతదేశ అవయవ గ్రహీతల వెయిటింగ్ లిస్ట్.. 5 లక్షలకు మించి ఉంటుందని డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రతిరోజూ 20 మంది భారతీయులు మరణిస్తున్నారు. కానీ ప్రాణాలను రక్షించే.. సూట్ అయ్యే అవయవాలను మాత్రం కనుగొనలేకపోతున్నారు.

ఈ మొత్తం ప్రక్రియ ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తుంది. సగటున, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, కిడ్నీ మార్పిడి చికిత్సకు మీకు దాదాపు రూ. 15 లక్షల మేర ఖర్చవుతుంది. గుండె మార్పిడికి మీకు రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. కాలేయ మార్పిడికి కూడా రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందు కోసం బీమా పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి ఖరీదైన చికిత్స సమయంలో బీమా పాలసీ అండగా నిలుస్తుంది. మరి ఎలాంటి పాలసీ తీసుకుంటే మంచిదో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.