మీ సిబిల్‌ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారా ?? ఇలా చేయండి

|

Aug 23, 2024 | 11:19 PM

బ్యాంకు నుంచి కానీ, ఇతర మార్గాల ద్వారా కానీ సులభంగా లోను పొందాలనుకుంటే.. సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా లోన్‌ పొందచవచ్చు. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ మీ సిబిల్‌ను చెక్‌ చేస్తుంది. సిబిల్‌ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలుసా..

బ్యాంకు నుంచి కానీ, ఇతర మార్గాల ద్వారా కానీ సులభంగా లోను పొందాలనుకుంటే.. సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా లోన్‌ పొందచవచ్చు. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ మీ సిబిల్‌ను చెక్‌ చేస్తుంది. సిబిల్‌ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో ఈ చిన్న ట్రిక్‌ ఉపయోగిస్తే సిబిల్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్‌ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు దఫాలుగా చెల్లిస్తే సిబిల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈ నెలలో మీ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు రూ.10,000 వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండు లేదా మూడు దఫాలుగా కొంత కొంత మొత్తం గడువు పూర్తయ్యేలోపు కట్టేయాలి. దీనివల్ల పేమెంట్‌ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్‌ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పామాయిల్‌ తోటలో జంటపాముల సయ్యాట.. ఆసక్తిగా చూసిన స్థానికులు

కూలిపోతున్న “డ్రీమ్‌ జాబ్‌” కలల సౌధం..

పోన్లే పాపం అని ఫోన్‌ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా

పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం

“టాడ్‌పోల్‌ వాటర్‌”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా

Follow us on