గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన ధర

|

Sep 03, 2024 | 8:59 PM

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39లు మేర పెంచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 1 న ధరలను సవరించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. 14 కేజీల గృహ వినియోగ గ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించడం వరుసగా ఇది మూడోసారి.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39లు మేర పెంచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 1 న ధరలను సవరించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. 14 కేజీల గృహ వినియోగ గ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించడం వరుసగా ఇది మూడోసారి. గత నెల జులైలో స్వల్పంగా రూ. 8.50 మేర పెంచాయి. అయితే అంతకుముందు నెల జులైలో రూ.69 మేర తగ్గించారు. తాజాగా పెరిగిన ధరలు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రిటైల్ ధర రూ.1,691.50కి చేరింది. అయితే కొన్ని నెలలుగా ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50 హైదరాబాద్​లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జియో ఫ్రీ స్టోరేజ్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌, యాపిల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ ధరలు తగ్గేనా ??

షూటింగ్‌ కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు.. ప్రైవేట్‌ వీడియోలు

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కి.మీ

అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??