Gold Rate: బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైందా ??

Updated on: Oct 22, 2025 | 7:02 PM

బంగారం, వెండి ధరల్లో ఇటీవల భారీ తగ్గుదల కనిపించింది. 12 ఏళ్ల తర్వాత ఒకే రోజు 6.3% గోల్డ్ రేటు తగ్గింది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం అదుపులోకి రావడం, భారత్, చైనా మినహా ఇతర దేశాల్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో పసిడి, వెండి ధరలు రాబోయే రోజుల్లో 50-60% వరకు పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం, వెండి ధరల్లో ఇటీవల భారీ తగ్గుదల కనిపిస్తోంది, ఇది మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న గోల్డ్ ధరలు డౌన్ ట్రెండ్‌కు సంకేతమా అన్న చర్చ జరుగుతోంది. విశ్లేషణల ప్రకారం, పసిడి పరుగులకు బ్రేక్ పడింది, ప్రస్తుత రేటు సగానికి సగం పడిపోవచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570 కాగా, కిలో వెండి ₹1,81,900గా ఉంది. 12 ఏళ్ల తర్వాత నిన్న ఒక్కరోజే బంగారం ధర 6.3 శాతం తగ్గింది. త్వరలో బంగారం ధర ₹1,00,000 దిగువకు వస్తుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అర్థరాత్రి మిస్టరీ కాల్‌.. చిన్నారి గొంతు విని డీజీపీ షాక్

బాక్స్‌లు విసిరికొట్టిన ఉద్యోగులు.. సోన్‌ పాపడీ మాకొద్దంటూ..

36,000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న ఆ వస్తువేంటి ??