ఖాతాదారులకు అలర్ట్‌.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్‌ !!

|

Nov 30, 2024 | 11:24 AM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే వారు ముందస్తుగా ఏయే రోజుల్లో బ్యాంకు మూసి ఉంటుందో తెలుసుకుని వెళ్లడం మంచిది. బ్యాంకుల సెలవుల జాబితా ప్రకారం ముందస్తు ప్లాన్‌ చేసుకుంటే పనులు ఈజీగా పూర్తిచేసుకోవచ్చు. మరో ఐదు రోజుల్లో నవంబర్‌ నెల ముగియబోతోంది. డిసెంబర్ ప్రారంభం కానుంది. గత నెలలోనూ బ్యాంకులకు చాలానే సెలవులు వచ్చాయి. డిసెంబర్‌లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి.

వాస్తవానికి డిసెంబర్‌లో పండుగలు ఉండవు. కానీ చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉంటాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. ఆర్బీఐ నివేదికల ప్రకారం.. డిసెంబర్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. డిసెంబర్ 1న ఆదివారం..ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న మంగళవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే. గోవాలో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 8న ఆదివారం – వారాంతపు సెలవు. డిసెంబర్ 10న మంగళవారం – మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం

ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??

వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్‌ అని !!