ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఘటన వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ‘పెళ్లి వార్త వైరల్ కావడమేంటి.. అందరూ పెళ్లిళ్లు చేసుకుంటారుగా..!’ అని ఆశ్చర్యపోతున్నారా..? అందరూ పెళ్లిళ్లు చేసుకుంటారు నిజమే. కానీ ఈ పెళ్లి మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడ పెళ్లి కొడుకు వయసు 23 ఏళ్లు.
పెళ్లి కూతురు వయసు మాత్రం 91 ఏళ్లు. ఇద్దరి నడుమ సుమారుగా 68 ఏళ్ల గ్యాప్. అంతేకాదు, హనీమూన్ ట్రిప్‌లో పెళ్లికుమార్తె చనిపోయింది. అందుకే ఈ వార్త వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనాలో ఓ 23 ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఓ 91 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు కూడా వారితో పాటే ఉంటోంది. అంతకుముందే యువకుడి తండ్రి చనిపోయి ఉండటంతో వారి కుటుంబం కడు పేదరికంలో ఉంది. దాంతో ఆ యువకుడు చదువు ఖర్చులకు కూడా డబ్బులు లేక తెగ ఇబ్బంది పడేవాడు. ఆ క్రమంలో ఒంటరి వృద్ధురాలు అతడికి ఒక ఆఫర్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటే యువకుడి చదువుతోపాటు, ఇంటి ఖర్చులు తానే చూసుకుంటానని చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటే తన సంపదతోపాటు, తన తదనంతరం ఒక భర్తగా తన పెన్షన్ కూడా అతడికే వస్తుందని తెలిపింది. వృద్ధురాలి ఆఫర్‌కు యువకుడితో పాటు అతడి తల్లి, సోదరుడు కూడా అంగీకారం తెలుపడంతో వారికి వివాహం జరిపించారు. వివాహం తర్వాత కొత్త జంట హనీమూన్‌కు వెళ్లారు. ఈ హనీమూన్ సమయంలోనే పెళ్లి కూతురు బెడ్‌పైనే ప్రాణాలు కోల్పోయింది. దాంతో యువకుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్ అని !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

