పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

Updated on: Sep 04, 2025 | 12:38 PM

దేశంలో పండుగల సీజన్ మొదలైపోయింది. దీంతో సీజన్ గిరాకీని అందిపుచ్చుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు వినియోగదారుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించాయి. రానున్న పండుగల వేళ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 పేరుతో అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 పేరుతో ఫ్లిప్ కార్ట్ బరిలోకి దిగేశాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, గృహోపకరణాలు, స్మార్ట్ హోమ్ డివైజ్ లు ఇలా అన్ని విభాగాల్లో రాయితీలను అందిస్తూ ఈ సీజన్ లో రికార్డు స్థాయి అమ్మకాలకు ఈ దిగ్గజ సంస్థలు రెడీ అవుతున్నాయి.

త్వరలో రానున్న దసరా, దీపావళి పండుగల కోసం అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. యాపిల్, Samsung, IQOO, OnePlus స్మార్ట్ ఫోన్ల మీద 40% వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. HP, Samsung, Sony, Boat ఎలక్ట్రానిక్స్ పై 80% వరకు రాయితీని ఇస్తోంది. గృహోపకరణాలపై 65% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో Sony, Samsung, LG, Xiaomi స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు వంటివి 65% తక్కువ ధరలకు లభిస్తాయి. SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% తక్షణ రాయితీ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫాస్ట్ డెలివరీ, ప్రీ వన్ డే, సేమ్ డే డెలివరీ వంటివి ఉన్నాయి. ఇక ఫ్లిప్ కార్ట్ అయితే సేల్ తేదీని కూడా ఇంకా వెల్లడించలేదు. నిరుడు సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ సేల్ ఈసారి కూడా అదే టైంలో ఉండే అవకాశం ఉంది. iPhone 16, Samsung Galaxy S24, OnePlus Buds 3, Motorola Edge 60 Pro వంటి హాట్ ప్రొడక్ట్స్ పై ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. అదనంగా Intel PC లు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. ఫ్లిప్ కార్ట్ బ్లాక్ అయితే కాష్ బ్యాక్ రివార్డులు అందిస్తోంది. ప్రతి కొనుగోలుపై 5% సూపర్ కాయిన్స్ కాష్ బ్యాక్ అందిస్తోంది. నెలకు గరిష్టంగా 800 సూపర్ కాయిన్స్ పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ Axis, ICICI బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు, EMI ట్రాన్సాక్షన్లపై 10% తక్షణ రాయితీ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో Paytm వాలెట్, Paytm UPI ద్వారా పేమెంట్స్ చేసేవారికి కాష్ బ్యాక్ లభిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

భారీ వర్ష సూచన..వచ్చే 24 గంటల్లో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం వీడియో

Published on: Sep 04, 2025 11:37 AM