మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం వీడియో
ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది అగ్రరాజ్యం. హెచ్1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ఇది సమస్యగా మారింది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని అయోమయంలో పడేసింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల చూపు భారత్ వైపు మళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ ఉద్యోగం పోతే భారత్ కు తిరిగి వచ్చేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు ఓ సర్వేలో తెలిసింది. అమెరికాలో నెలకొన్న అనిశ్చితి ఉద్యోగ భద్రతను లోపించడమే ఈ మార్పునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
సర్వే ప్రకారం ఉద్యోగం కోల్పోతే మీ తదుపరి ప్రణాళిక ఏంటని ప్రశ్నించగా 45% మంది వెంటనే భారత్ కు తిరిగి వస్తామని స్పష్టం చేశారు. మరో 26% మంది వేరే దేశానికి వెళ్తామని చెప్పగా మిగిలిన 29% ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బి వీసాలపై విధిస్తున్న కఠిన నిబంధనల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు వారు అమెరికాను వదిలి రావడానికి కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీరిలో 25% మంది జీతాలలో భారీ కోతలు ఉంటాయని భయపడుతున్నారని 24% మంది జీవన ప్రమాణాలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అలాగే సాంస్కృతిక కుటుంబపరమైన సర్దుబాట్లు ఉద్యోగ అవకాశాల కొరత వంటివి కూడా తమను కలవరపెడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సర్వేలో బయటపడ్డ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ అమెరికా వర్క్ వీసాని ఎంచుకుంటారా అని ప్రశ్నించగా కేవలం 35% మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి అమెరికాలో ఉద్యోగ అభద్రత వంటి కారణాలతో భారత నిపుణుల అమెరికాపై ఆకర్షణ క్రమంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
చైనా కారులో మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు వీడియో
డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. ఏం జరిగిందంటే? వీడియో
భర్త కళ్లలో కారం కొట్టి హత్య… కారణం ఇదే వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
