AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవితపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు.. లేఖలో షాకింగ్ విషయాలు వీడియో

కవితపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు.. లేఖలో షాకింగ్ విషయాలు వీడియో

Samatha J
|

Updated on: Sep 03, 2025 | 10:04 PM

Share

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీంద్రారావు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీలో సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కవితపై వేటు వేశారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

కవిత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నారని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కూడా బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ హరీష్ రావు, సంతోష్ రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతిని స్థాపించిన ఉద్యమ పార్టీతోనే కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగించిన కవిత ఒక్కసారిగా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తర్వాత ఆ స్థాయి నాయకురాలుగా కవితకు పేరు ఉండేది. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాక పరిస్థితి మారింది. పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేపట్టిన కార్యక్రమాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. జాగృతి కోసం ప్రత్యేకంగా ఆఫీసును ప్రారంభించిన ఆమె ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేనట్లుగానే ప్రోగ్రామ్స్ తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

చైనా కారులో మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు వీడియో

డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. ఏం జరిగిందంటే? వీడియో

భర్త కళ్లలో కారం కొట్టి హత్య… కారణం ఇదే వీడియో