భారీ వర్ష సూచన..వచ్చే 24 గంటల్లో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వీడియో
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ వెదర్ సెంటర్ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది? నిన్న ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి వచ్చింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నిన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల నుండి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు క్షీణించింది.
ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల నుండి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు క్షీణించడం వల్ల రైన్‌ఫాల్ బెల్ట్ కొంచెం షిఫ్ట్ అయింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉంటాయంటే మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి ఐదు రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి రెండు రోజులు కొన్ని ప్రాంతాలపై తదుపరి ఐదు రోజులు ఒకటి రెండు ప్రాంతాలపై అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. గాలులు మెరుపులు కొనసాగడం రాబోయే 24 గంటల్లో ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలోనే ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. అన్న కూడా ఈ జిల్లాలకు భారీ వర్షపాతాన్ని సూచించాం. కానీ కొంచెం ఆ ట్రఫ్ వీకెన్ అయినందువల్ల మీకు కొన్ని జిల్లాలు తగ్గాయి. కానీ ఈ నాలుగు జిల్లాలకు ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త ఒడిశా వైపుగా రాబోయే 24 గంటల్లో దాని ప్రయాణం జరిగి వస్తుందని చెబుతుంది. ఐఎండీ. ఆ ప్రభావం ఇంకా ఎన్ని రోజులపాటు ఏపీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న అల్పపీడనం మరింత స్పష్టంగా మారి ఒడిశా మీదికే ప్రయాణించే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్న ఎక్స్‌ట్రీమ్ నార్త్ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. మిగతా జిల్లాలకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం.
మరిన్ని వీడియోల కోసం :
చైనా కారులో మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు వీడియో
డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. ఏం జరిగిందంటే? వీడియో
భర్త కళ్లలో కారం కొట్టి హత్య… కారణం ఇదే వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
