చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కూరగాయలోనే

Updated on: Jul 24, 2025 | 7:21 PM

బోడకాకర మీ బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక మొత్తంలోలభించే ఫైబర్ కారణంగా బోడకాకరను తినడం వల్ల త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది. అటు జీర్ణక్రియనూ ఇది మెరుగు పరుస్తుంది. బోడ కాకరలోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాగే, వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది.

నిపుణుల సూచనల మేరకు మీ అవగాహన కోసం మాత్రమే మేం మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి. పంటపొలాలు, రోడ్లు, అటవీ ప్రాంతాలలో పడి మొలిచి కాచే కూరగాయ ఇది. ప్రయత్న పూర్వంకంగా దీని గింజలు నాటినా..అవి కాయవనే మాటా ఉంది. మారుమూల ప్రాంతాలలో బహు తక్కువగా కాసే ఈ బోడ కాకరకు ఈ సీజన్‌లో ఎంతో డిమాండ్. ఆకుపచ్చగా, గుండ్రంగా, మెత్తని నూగుతో సుతిమెత్తగా ఉండే బోడ కాకర కూర రుచి చూస్తే.. ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు పోషకాల పరంగానూ ముందున్న బోడ కాకరను ఈ సీజన్‌లో ఒకసారైనా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల వానాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లు రావని వారు సూచిస్తున్నారు. బోడ కాకరలో విటమిన్స్, అమైనో యాసిడ్స్‌, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువ ఉండటం వల్ల .. షుగర్ ఉన్నవారు దీనిని తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బోడ కాకరలోని పొటాషియం .. రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే బీపీ రోగులకు ఇది మంచి ఆహారం. బోడకాకర మీ బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక మొత్తంలోలభించే ఫైబర్ కారణంగా బోడకాకరను తినడం వల్ల త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది. అటు జీర్ణక్రియనూ ఇది మెరుగు పరుస్తుంది. బోడ కాకరలోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాగే, వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. నిపుణుల సూచనల మేరకు మీ అవగాహన కోసం మాత్రమే మేం మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో

పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..

సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్.. ధర ఎన్ని రూ.లక్షలో తెలుసా?