AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: 'అమ్మ చదువుకోమంటోంది..' తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు

Vijayawada: ‘అమ్మ చదువుకోమంటోంది..’ తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు

Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 18, 2025 | 2:56 PM

Share

విజయవాడలోని ఒక బాలుడు తన తల్లిని చదువుకోమని బలవంతం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, తన కుమారుడు చదువుకునేలా ప్రోత్సహించడంతో, బాలుడు కోపంతో ఈ పని చేశాడు. ఏసీపీ దుర్గా రావు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు, బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.

విజయవాడలోని సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తన తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తల్లి తనను చదువుకోమని బలవంతం చేస్తుందని బాలుడు ఆరోపించాడు. తల్లి ఒంటరిగా ఇద్దరు కుమారులను పెంచుకుంటోంది. పెద్ద కుమారుడు పని చేసి చిన్న కుమారుడి చదువుకు ఖర్చులు భరిస్తున్నాడు. చిన్న కుమారుడికి తల్లి సెల్ ఫోన్ ఇవ్వడంతో అతను చదువుకు దూరమవుతున్నాడని, అందుకే అతనిని చదువుకోమని చెప్పడంతో బాలుడు కోపంతో పోలీసులను ఆశ్రయించాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిని పిలిపించి ఏసిపి దుర్గా రావు విచారించి, బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.

Published on: Sep 18, 2025 02:55 PM