AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను.. మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్

Phani CH
|

Updated on: Nov 03, 2026 | 12:44 PM

Share

బిగ్‌బాస్‌ మలయాళం షోలో నేహా ఫాతిమా వ్యవహారం వివాదంగా మారినట్లు కథనం చెబుతోంది. మరో కంటెస్టెంట్‌ సంతోష్‌ రాజ్‌తో ఆమె ప్రేమాయణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, వారాంతపు ఎపిసోడ్‌లో మోహన్‌లాల్‌ సమక్షంలో స్టేజ్‌పైకి వచ్చారని సమాచారం. తమ కూతురిని షో నుంచి బయటకు పంపాలని కోరడంతో నిర్వాహకులు ఆమెను హౌస్‌ నుంచి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా తెలుగులో రోహిత్ ఎలిమినేషన్ వివాదం నడుస్తుంది. అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ విన్నర్ మెటిరియల్ అని.. అతడిని కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరోవైపు బెంగాలీ బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్స్, హగ్గులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవన్నీ ఒకెత్తైతే, మలయాళ బిగ్‌బాస్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా ఒక కంటెస్టెంట్ తల్లిదండ్రులే స్టేజ్‌పైకి వచ్చి తమ కూతురిని షో నుంచి బయటకు తీసుకెళ్లడం టెలివిజన్ చరిత్రలో సంచలనంగా మారింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ మలయాళం’ షోలో నేహా ఫాతిమా ఒక కంటెస్టెంట్‌. తన ఆటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గేమ్‌లో భాగంగా ఆమె మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ తో సన్నిహితంగా మెలిగారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ షోకే హైలైట్‌గా నిలిచింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, సంతోష్ రాజ్‌కు నేహా ఫాతిమా బహిరంగంగానే లవ్ ప్రపోజల్ చేసింది. నేహా చేసిన ప్రపోజల్‌కు సంతోష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ లవ్ ట్రాక్ పై నేహా తల్లిదండ్రులకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమ కుటుంబ పరువు, మత సంప్రదాయాలకు విరుద్ధంగా కూతురు వ్యవహరిస్తోందని వారు భావించారు. దీంతో వారాంతపు ఎపిసోడ్‌లో హోస్ట్ మోహన్‌లాల్ సమక్షంలో నేహా తల్లిదండ్రులు నేరుగా స్టేజ్‌పైకి వచ్చారు. తమ కూతురి ప్రవర్తనపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెను వెంటనే షో నుంచి బయటకు పంపించాలని పట్టుబట్టారు. పెద్దల ఆందోళన, కుటుంబ పరువు దృష్ట్యా నిర్వాహకులు కూడా నేహా ఫాతిమాను అర్ధాంతరంగా హౌస్ నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. దాంతో ఆమె బిగ్‌బాస్ ప్రయాణం ఎటువంటి ముగింపు లేకుండానే మధ్యలోనే ముగిసింది. బిగ్‌బాస్ చరిత్రలో లవ్ ట్రాక్ వివాదం కారణంగా కంటెస్టెంట్ బయటకు వెళ్లడం ఇదే మొదటిసారిన చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amitabh Bachchan: గ్యాంగ్‌ స్టర్‌ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్

Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు

Bigg Boss Rohit: సడెన్‌ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు..

Follow Us