పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పనిమనుషులు రూ. 18 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను చోరీ చేశారు. ఇది ఇటీవల కాలంలో పనిమనుషులు చేసిన అతిపెద్ద దోపిడీ. నేపాలీ జంట ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 20 రోజుల క్రితమే పనిలో చేరి, యజమాని కుటుంబం బయటికి వెళ్ళిన అదను చూసి పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పనిమనుషులే రూ. 18 కోట్ల విలువైన బంగారం ఆభరణాలతో పరారయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో పనిమనుషులు చేసిన అతిపెద్ద దోపిడీ ఇది. పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశారు కేటుగాళ్లు. యజమాని బయటికెళ్లిందే అదనుగా ఇంట్లో చొరబడి చోరీ చేశారు. కోట్ల విలువైన బంగారు నగలు దోచుకొని పరారయ్యారు. బెంగళూరులో బిల్డర్ షిమంత్ అర్జున్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. దాదాపు రూ.17.74 కోట్ల విలువైన బంగారం , వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. షిమంత్ ఇంట్లో పని చేస్తున్న నేపాలీ జంట ఈ దోపిడీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి కోసం గాలిస్తున్నారు. ఇంటి యజమాని షిమంత్ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రమానికి వెళ్లగా అదే అదనుగా ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్, కమలా మరో నేపాలితో కలిసి చోరీ చేసారు. షిమంత్ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇద్దరు 20 రోజుల ముందు హౌస్ కీపింగ్ పనిలో చేరారని పోలీసులు తెలిపారు. పనిచేస్తూనే ఇంటి యజమాని కుటుంబ సభ్యుల కదలికలను గమనించి దోపిడీకి ప్లాన్ చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పని మనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క యుద్ధనౌక చాలు.. ఇరాన్ పని ఖతమేనా?
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
