బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం.. ఇక వానలే వానలు వీడియో
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీనికి మోతా అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 29న తుఫాన్ తీరం దాటనుంది.
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలకు ముప్పు ఎక్కువని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయం తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈ నెల 29న తుఫాన్ తీరం దాటనుంది. ఒకవేళ బలపడితే ఈ తుఫాన్‌కు మోతా అని నామకరణం చేస్తారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. విశాఖపట్నం, తిరుపతి వరకు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
