Alai Balai: ఘనంగా దత్తన్న అలయ్ బలయ్.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..

Updated on: Oct 03, 2025 | 12:07 PM

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ దసరా సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. తెలంగాణ, హర్యానా ముఖ్యమంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ దసరా సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. తెలంగాణ, హర్యానా ముఖ్యమంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమ ప్రారంభంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ డోలు వాయిస్తూ అలయ్ బలయ్ సమ్మేళనాన్ని ఘనంగా ఆరంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను ప్రదర్శించే ఈ కార్యక్రమం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చూపే విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కళాకారులతో కలిసి వీహెచ్‌ డప్పు వాయించి సందడి చేశారు.అలయ్ బలయ్‌కు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక తెలంగాణ వంటకాలు సిద్ధం చేశారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి రుచికరమైన వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండగ పూట.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలిక

రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌

దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!

సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు

Published on: Oct 03, 2025 12:06 PM