పండగ పూట.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.
పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ కరవు భత్యాన్ని అందజేస్తారు. 3శాతం పెంపు నిర్ణయంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరనుంది. తద్వారా 49 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. తాజా పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాది జులై 1 నుంచే వర్తింపజేయనున్నారు. దీంతో ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు కూడా అందనున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ డీఏ పెంపుతో పాటు క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. రూ.5,863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం సమృద్ధికి ఆమోదం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలిక
రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్
దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

