ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు

|

Oct 03, 2024 | 8:56 PM

సంతానం కలగని దంపతులకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ఓ వరం. ఏళ్ల తరబడి పిల్లల కోసం ఎదురుచూసి ఇక తమ కడుపు పండదని నిరాశ చెందిన చాలామంది మహిళలు ఐవీఎఫ్ వల్ల తల్లులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ఎంతోమంది దంపతులను తల్లిదండ్రులుగా మార్చింది. అయితే, ఇప్పుడీ విధానంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు..

సంతానం కలగని దంపతులకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ఓ వరం. ఏళ్ల తరబడి పిల్లల కోసం ఎదురుచూసి ఇక తమ కడుపు పండదని నిరాశ చెందిన చాలామంది మహిళలు ఐవీఎఫ్ వల్ల తల్లులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ఎంతోమంది దంపతులను తల్లిదండ్రులుగా మార్చింది. అయితే, ఇప్పుడీ విధానంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని అన్నారు. స్వీడన్ లోని గోతెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ప్రొఫెసర్ ఉల్లా బ్రిట్ వివరాల ప్రకారం.. ఐవీఎఫ్ విధానంలో జన్మించిన పిల్లలలో గుండె పనితీరులో లోపాలను గుర్తించామని చెప్పారు. ఇది చాలా సీరియస్ ముప్పు అని, ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చిన్నతనంలోనే సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళలు ఒకరి కంటే ఎక్కువ మందికి జన్మనిస్తే.. వారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండడం తాము గుర్తించామని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..

కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు

Follow us on