Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత
శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్తీకమాసంలో గర్భాలయంలో నిర్వహించే సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నవంబరు 14 నుంచి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు నియమనిష్టలతో పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ఈ సమయంలో గర్భాలయంలో అభిషేకాలు నిలిపివేయడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు.
శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్తీకమాసంలో గర్భాలయంలో నిర్వహించే సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నవంబరు 14 నుంచి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు నియమనిష్టలతో పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ఈ సమయంలో గర్భాలయంలో అభిషేకాలు నిలిపివేయడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. కార్తికమాసం నెల రోజులు, పర్వదినాలు, సెలవురోజులలో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీకమాసమంతా గర్భాలయ ఆర్జిత అభిషేకాలు,సామూహిక ఆర్జిత అభిషేకాలు,వృద్ధమల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కార్తీకమాసం నెలరోజులు శ్రీస్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు
Nepal earthquake: నేపాల్ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి
Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం
లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరో కూతురు !! ధర రూ. 15.75 కోట్లపై మాటే
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

