నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ??

|

Oct 09, 2024 | 6:06 PM

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ 9 రోజులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. హిందూ మతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాల్లో అమ్మవారి ఉపాసకులు ఉపవాస దీక్ష చేపడతారు. ఉపవాసం చేయడం అనేది ఆధ్యాత్మికత పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరమని చెబుతారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ 9 రోజులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. హిందూ మతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాల్లో అమ్మవారి ఉపాసకులు ఉపవాస దీక్ష చేపడతారు. ఉపవాసం చేయడం అనేది ఆధ్యాత్మికత పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరమని చెబుతారు. నవరాత్రులలో ఉపవాసం చేసే సముయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉపవాస సమయంలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఉపవాస సమయంలో నీరు ఎక్కువగా త్రాగాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వదు. కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది. ఉపవాస సమయంలో నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఇవి గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. ముఖ్యంగా మధుమేహం లేదా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఆయిల్ స్నాక్స్ తినకూడదు. దీనికి బదులుగా పండ్లు లేదా బత్తాయి వంటి వాటిని తినవచ్చు. అలాగే ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి 2 నుంచి 3 గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఆకలితో ఉండటం వల్ల ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీంతో త్వరగా అలసట కూడా వస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన 17 ఏళ్ల బాలిక

బంకర్‌లో అమెరికా జంట పెళ్లి.. బాంబుల వర్షం కురుస్తున్నా తగ్గేదేలే

బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్‌ & ఆడియెన్స్..

Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన

కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..