యువకుడిని కాపాడిన ఆపిల్ వాచ్.. సముద్రంలో స్కూబా డైవింగ్ లో ప్రమాదం వీడియో
ముంబైకి చెందిన 26 ఏళ్ల క్షితిజ్ జోడాపే పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా 36 మీటర్ల లోతులో వెయిట్ బెల్ట్ విడిపోయింది. దీంతో వేగంగా పైకి దూసుకురావడంతో ఊపిరి అందక ప్రమాదంలో పడ్డాడు. అతని ఆపిల్ వాచ్ అల్ట్రా సైరన్ మోగడంతో కోచ్ సాయంతో క్షితిజ్ ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ సంఘటన వైరల్‌గా మారింది.
ఆపిల్ స్మార్ట్ వాచ్ అనేకమంది ప్రాణాలను కాపాడిన ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. తాజాగా, సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న యువకుడి ప్రాణాలను ఆపిల్ వాచ్ అల్ట్రా కాపాడింది. ముంబైకి చెందిన 26 ఏళ్ల డెవలపర్ క్షితిజ్ జోడాపే పుదుచ్చేరిలో తన కోచ్‌తో కలిసి స్కూబా డైవింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. 36 మీటర్లు లోతుకు వెళ్లిన తర్వాత, అతని వెయిట్ బెల్ట్ ఊడిపోయింది. దీంతో క్షితిజ్ వేగంగా నీటిపైకి వచ్చాడు. ఊపిరితిత్తులు వ్యాకోచించి ఊపిరి అందక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో అతని ఆపిల్ వాచ్ వెంటనే సైరన్ మోగించింది. సమీపంలో ఉన్న కోచ్ ఆ శబ్దం విని వెంటనే క్షితిజ్‌ను రక్షించాడు. ఆపిల్ వాచ్ ఇంత కచ్చితంగా పనిచేస్తుందని ఊహించలేదని క్షితిజ్ తెలిపాడు. ఈ సంఘటనను అతను సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యింది. స్మార్ట్ వాచ్ ధరించడం వల్లే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని క్షితిజ్ పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
