Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

Edited By: Phani CH

Updated on: Nov 27, 2025 | 6:12 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్' ను ప్రవేశపెట్టింది. చంద్రబాబు ఆదేశాల మేరకు 1.4 కోట్ల కుటుంబాలకు QR కోడ్‌తో కూడిన ఈ ఆల్‌ ఇన్ వన్ కార్డ్‌ను జారీ చేయనున్నారు. ఇది పౌర సేవలను సులభతరం చేస్తుంది, అన్ని సంక్షేమ పథకాలను ఒకే కార్డు కిందకు తెస్తుంది. P-4 సహా 25 రకాల వివరాలతో కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థ ద్వారా నిజ సమయ పాలనను లక్ష్యంగా చేసుకుంది.

వన్‌ ఫ్యామిలీ. వన్‌ యూనిట్‌. స్మార్ట్‌ ఫ్యామిలీకి స్మార్ట్‌ కార్డ్‌. ఏపీలోని అన్ని కుటుంబాలకు స్మార్ట్‌ కార్డ్‌ జారీ చేయనుంది చంద్రబాబు సర్కార్‌. దీంతో పౌరసేవలు ఇక సులభతరం కానున్నాయి. అన్ని పథకాలకు ఒకటే కార్డ్ రానుంది. ఈ ఆల్‌ ఇన్ వన్‌ కార్డుతో ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయి? ఏపీలోని 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలనీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిలో 25 రకాల వివరాలతో పాటు P-4 లాంటి అంశాలను చేర్చాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, దీన్ని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. RTGS దగ్గర ఉన్న ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు , స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు సీఎం. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్‌ను పరిమితం చేయొద్దని, ప్రజలకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులకు అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌ లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం

40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే

Published on: Nov 27, 2025 04:40 PM