Tirumala: మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై ఫోకస్..

|

Dec 01, 2024 | 12:03 PM

తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం కాబోతోంది. ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడే అజెండాతో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదంటున్న టీటీడీ.. తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామంటోంది టీటీడీ.

తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. 2019లో ఐఐటీ నిపుణులు తిరుమల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాకపోగా.. కూటమి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌తో తిరుమల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. టీటీడీలో అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌ లు, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. పాత కాటేజీలను తొలగించి మరో 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. టౌన్ ప్లానింగ్‌లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించుకుని తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత ఉండేలా అభివృద్ధి చేయబోతోంది. దాతలు నిర్మించే కాటేజీలకు సొంత పేర్లు కాకుండా టీటీడీ సూచించే పేర్లను కాటేజీలకు పెట్టేలా దాతలు సహకరించాలని టీటీడీ బోర్డు కోరుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.