AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స.. పది రోజులు విశ్రాంతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తుంది.  నేడు హైదరాబాద్ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగింది. పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేశారని సమాచారం. శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. పవన్‌కు వైద్యపరీక్షలు, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించారు. పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స.. పది రోజులు విశ్రాంతి
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2026 | 9:56 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఉదయం అధికారులతో పాలనాపరమైన సమీక్ష నిర్వహిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎం.ఆర్.ఐ పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నపాటి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జనసేన అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి స్వస్థత చేకూరడానికి కొంత సమయం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

Follow Us