Weather Update: వచ్చే రెండు రోజులూ జాగ్రత్త !! వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేంత చలి, దట్టమైన మంచు పేరుకుపోతోంది. అరకు, పాడేరులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ పలుచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. మైదాన ప్రాంతాలతో పోల్చితే ఏజెన్సీ ప్రాంతాల్లోనే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఏపీలోని అల్లూరి జిల్లాలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకు, పాడేరులో చలి తీవ్రతకు పొగమంచు గడ్డకడుతోంది. ఆరుబయట పార్క్ చేసిన వాహనాలపై కురిసిన మంచు.. తెల్లవారేసరికి గాజు ముక్కలా పేరుకుపోతోంది. అరకు, డుంబ్రిగూడ, జి.మాడుగుల, చింతపల్లి, మినుములూరు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మినుములూరులో 5, పాడేరులో 7, చింతపల్లిలో 7.5 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డు అయ్యాయి. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని పేర్కొంది. ఇక..తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పటాన్‌చెరులో 8.2, ఆదిలాబాద్‌లో 9.2, రాజేంద్రనగర్‌లో 10, భద్రాచలంలో 15, దుండిగల్‌లో 13.9, హనుమకొండలో 12 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 13.7, ఖమ్మంలో 15, మహబూబ్‌నగర్‌లో 17, మెదక్‌లో 10.2, నల్గొండలో 13.4, నిజామాబాద్‌లో 13.6, రామగుండంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలలో ల్లో సాయంత్రం నాలుగైదు గంటలకే చల్ల గాలులు మొదలైపోతున్నాయి.. ఉదయం 10 దాటినా ఆ తీవ్రత తగ్గడంం లేదు. ఏజెన్సీల్లో చలి గాలుల తీవ్రతకు గిరిజనం వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 21 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. రాబోయే రెండ్రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్
న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా
