సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ

Updated on: Jan 19, 2026 | 8:02 PM

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సంక్రాంతి పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల తేజ అనే యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. ఇటీవల ఫిట్స్ వచ్చిన తేజకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో తేజ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

అన్నమయ్యజిల్లాచౌడేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు కుప్ప కూలి పోయాడు. స్నేహితులు, స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించేలోపే జరగకూడనిది జరిగిపోయింది. సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతున్న యువకుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. పెద్దూరుకు చెందిన 22 ఏళ్ల తేజ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ చదవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు వెళ్ళాడు. పాలెంపల్లి వెంగణపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మైదానంలో పరిసర గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికే తేజ తోపాటు అతని టీమ్ కూడా అక్కడికి వెళ్ళింది. స్నేహితులంతా కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్‌ చేస్తున్న తేజ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. కంగారు పడిన స్నేహితులంతా అతనికి సపర్యలు చేసి పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే తేజ అచేతనంగా ఉండటంతో వెంటనే చికిత్స కోసం మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే తేజ మృతిచెందినట్టు గుర్తించారు. తేజ ఈ మధ్యనే ఫిట్స్ వచ్చి అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తేజ క్రికెట్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలి పడిపోవడంతో హార్ట్ స్ట్రోక్ కు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. తేజ మృతితో గ్రామంలో విషాదం నిండిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి

పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్‌!

చెన్నైలో ఎన్టీఆర్ నివాసం.. త్వరలో అభిమానులందరికీ ప్రవేశం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా !!