ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైంది అల్పపీడనం.. ఈ నెల 25 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అది వాయుగుండంగా మారి.. 27న దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.
దీంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోలోని అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచానా వేసింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజులు.. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్
వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ
Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా
Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట