AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్

శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్

Phani CH
|

Updated on: Sep 24, 2025 | 1:43 PM

Share

నటి సాక్షి అగర్వాల్‌కు ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన పనీర్ కర్రీలో చికెన్ ముక్కలు రావడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రెస్టారెంట్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇటీవల బాగా ఆకలిగా ఉండటంతో, సాక్షి అగర్వాల్ స్విగ్గీ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి పనీర్ వంటకాన్ని ఆర్డర్ చేశారు.

అయితే, డెలివరీ వచ్చిన తర్వాత తినడం మొదలుపెట్టగా, అందులో పనీర్‌తో పాటు చికెన్ ముక్కలు కూడా ఉండటాన్ని గమనించి షాకయ్యారు. తాను పుట్టినప్పటి నుంచి పూర్తి శాకాహారినని, అలాంటి తనతో బలవంతంగా మాంసాహారం తినిపించినట్లయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని తనకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం దారుణం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, ఒక శాకాహారికి చికెన్ పంపడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని సదరు రెస్టారెంట్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎంతో మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, రెస్టారెంట్ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాక్షి అగర్వాల్ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అట్లీ దర్శకత్వం వహించిన రాజా రాణి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్ కాలా సినిమాలో నటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ

Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా

విజయవాడ భవానిపురంలో దారుణం

Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట

Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు