బీ కేర్ ఫుల్..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

Updated on: Oct 22, 2025 | 7:37 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో అత్యధికంగా 52.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో 52.9 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తుండగా, పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఏఎస్‌పేట వద్ద గాలులకు చెట్లు విరిగిపడ్డాయి, వరిపంట నీటమునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, నివా నదికి వరద ఉధృతి పెరిగింది. కడప జిల్లాలో పింఛా ప్రాజెక్ట్ నిండి, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Heavy Rains: భారీ వర్షాలతో.. ఉప్పొంగుతున్న కపిలతీర్థం జలపాతం

రూ.కోట్లు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే.. నెగెటివ్ రివ్యూలు ఇస్తారా

ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సిద్ధమవుతోన్న నిర్మాతలు

కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?

వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు