ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాన్.. పొంచి ఉన్న ముప్పు వీడియో
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 26 నుండి 29 వరకు ఏపీలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, 60-80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి, అక్టోబర్ 26న వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 26 నుండి 29 వరకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈ సమయంలో గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
