Visakhapatnam: ఆ వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి వీల్‌ఛైర్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌కే పరిమితం

Visakhapatnam: ఆ వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి వీల్‌ఛైర్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌కే పరిమితం

Anil kumar poka

|

Updated on: Aug 13, 2023 | 7:22 AM

చిన్నతనం నుంచే చదువుల్లో దిట్ట.. గొప్ప ఆశలు.. కోటి కళలు.. ఉన్నత భవిష్యత్తు ఉహించుకున్న కుర్రాడు.. ఇంటికే పరిమితమయ్యాడు. మాయదారి రోగంతో మంచానికే పరిమితమయ్యాడు. పేద కుటుంబం కావడంతో శ్రద్ధగా చదివి.. ఉన్నత ఉద్యోగంతో అమ్మానాన్నల కష్టాలు తీర్చాలనుకున్నాడు. తల్లిదండ్రులు సైతం శక్తికి మించిన పని అయినప్పటికీ.. ఉన్నత విద్యలు చదివేలా ప్రోత్సహించారు.

చిన్నతనం నుంచే చదువుల్లో దిట్ట.. గొప్ప ఆశలు.. కోటి కళలు.. ఉన్నత భవిష్యత్తు ఉహించుకున్న కుర్రాడు.. ఇంటికే పరిమితమయ్యాడు. మాయదారి రోగంతో మంచానికే పరిమితమయ్యాడు. పేద కుటుంబం కావడంతో శ్రద్ధగా చదివి.. ఉన్నత ఉద్యోగంతో అమ్మానాన్నల కష్టాలు తీర్చాలనుకున్నాడు. తల్లిదండ్రులు సైతం శక్తికి మించిన పని అయినప్పటికీ.. ఉన్నత విద్యలు చదివేలా ప్రోత్సహించారు. కానీ విధి చిన్నచూపు చూపింది. ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్న అతడు.. రోజుల వ్యవధిలోనే కృశించి పోయాడు. ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నారపల్లి సమీపంలోని కొర్రెములకు చెందిన చంద్రశేఖర్‌-జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్‌ సొంతూరులో చిన్న ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు.

వచ్చే అరకొర ఆదాయంతోనే బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పిల్లల చదువుల కోసం కొద్దికాలంగా చైతన్యపురి ఫణిగిరి కాలనీలో అద్దెకు ఉంటున్నారు. పెద్ద కుమారుడు 20ఏళ్ల కార్తీక్‌ చిన్నతనం నుంచి చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చేవాడు. ఘట్కేసర్‌లోని శ్రీనిధి కళాశాలలో ఇంజినీరింగ్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సంతోషంగా సాగిపోతుండగా.. ఏడు నెలల క్రితం కార్తీక్‌కు దగ్గు ప్రారంభమైంది. ఎంతకూ తగ్గకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాలన్నారు. ఇందుకు సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ ఆక్సిజన్‌ తీసుకుంటూ.. మందులు వాడుతున్నారు. స్తోమతకు మించి ఇప్పటికే 15 లక్షలు ఖర్చు చేశామని.. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...