Viral Video: మందుకొట్టిన తండ్రి.. విమానం నడిపిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో.
బ్రెజిల్‌లో ఓ విమానం కూలిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా తండ్రి పక్క సీట్లో బీర్ తాగినట్టు కనిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

గారాన్ మాయా అనే పరిశోధకుడు తన పదకొండేళ్ల కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో కలిసి ట్విన్ ఇంజిన్ బీచ్ క్రాఫ్ట్ బేరాన్ 58 విమానంలో బయలుదేరాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానం అడవిలో కూలిపోయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ తండ్రీ కొడుకులు రాండోనియా నగరం నుంచి బయలుదేరారు. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి వద్ద దింపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో గారాన్ తన కుమారుడికి విమానం ఎలా నడపాలో చెపుతుండటం స్పష్టంగా కనిపించింది. నిబంధనల ప్రకారం, కనీసం హైస్కూల్ చదువు పూర్తి చేసి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే విమానాలు నడిపేందుకు అర్హులు. ఆ వ్యక్తికి తన కుమారుడి భద్రతపై ఎంత శ్రద్ధ ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని అధికారులు వ్యాఖ్యానించారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో