విమానాల కిటికీలు మూసేయండి..! ఈ కొత్త రూల్ ఎందుకంటే..
రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విమానాల కిటికీలను మూసి ఉంచాలని డీజీసీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల దగ్గర ఈ సూచన తప్పక పాటించాలని తెలిపింది. కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్‌ను తప్పక వాడాలని తెలిపింది.
విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్ మూసే ఉంచాలని తెలిపింది. పాకిస్థాన్‌తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు బదులుగా పాకిస్థాన్ కాల్పులు జరిపింది. డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించగా, వాటన్నింటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ పోరులో భారత్ పైచేయి సాధించింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పులు విరమిద్దామంటూ ప్రతిపాదించింది. అలా ఇరుదేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం అలాగే ఉన్నాయి. దౌత్యపరమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు మరో దేశానికి తమ గగనతలాన్ని నిషేధం విధించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవ శరీర భాగాలు .. బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు..
పసిపిక్ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?
సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో
కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!
ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
