బయట కాలుష్యం.. కడుపులో బిడ్డకు ప్రమాదమా..?

Updated on: Dec 19, 2025 | 1:57 PM

వాయు కాలుష్యం గర్భస్థ శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లి పీల్చే కలుషిత గాలి శిశువుకు అందే పోషకాలు, ఆక్సిజన్‌ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ప్రిమెచ్యుర్ డెలివరీలు, పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్లాసెంటా ద్వారా కాలుష్య కారకాలు శిశువుకు చేరతాయి. కాలుష్యాన్ని తగ్గించలేకపోయినా, ఇంట్లో ఉండటం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ నష్టాలను తగ్గించవచ్చు.

గర్భంలోని బిడ్డలకు ఆక్సిజన్, పోషకాహారం అన్నీ తల్లి నుంచే అందుతాయి. తల్లి తినేవి, అనుభూతి చెందేవి, పీల్చ గాలి.. అన్నీ పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి. గాలి, నీరు, శబ్ద కాలుష్యం.. బిడ్డపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. గర్భంలోని శిశువును కూడా కాలుష్యం వదలట్లేదని ప్రిమెచ్యుర్ డెలివరీతో పాటు పుట్టుకతో కొన్ని లోపాలకు కాలుష్యం కారణమవుతోందని ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌ అధ్యయనంలో బయటపడింది. గర్భం దాల్చిన తొలి నెలలో బిడ్డపైన కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఊపిరి తీసుకున్నప్పుడు కాలుష్యం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. కొన్ని సూక్ష్మ పదార్థాలు ఊపిరితిత్తుల గోడలకే అంటుకుపోతాయి. కొన్ని రక్తంలో కలిసిపోతాయి. కొన్ని ప్లాసెంటా వరకూ చేరతాయి. అక్కడి కాలుష్య పదార్థాలు పొగైతే వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువుకు రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది. బిడ్డకు పోషకాలు ప్లాసెంటా రక్తం ద్వారానే అందుతాయి. తక్కువ రక్త ప్రసరణ వల్ల బిడ్డ ఎదుగుదల మందగిస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్లాసెంటాకు రక్తప్రసరణ సరిగా లేకపోతే అది త్వరగా మెచ్యూర్ అవడంతో ప్రిమెచ్యుర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. తల్లి వాయు కాలుష్యానికి గురికావడం వల్ల.. శిశు మరణాలు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, అలెర్జీల వంటి దీర్ఘకాలక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఇప్పటికిప్పుడే.. ఈ కాలుష్యాలను తగ్గించలేం.. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ ప్రభావలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండటం, బయటకెళ్లినప్పుడు ముఖానికి మాస్క్‌ ధరిస్తే.. గర్భధారణపై వాయు కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పుడు మాయం.. ఇన్నాళ్లకు ప్రత్యక్షం !! నాటి హీరో దీనగాథ

నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..

జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు.. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో

6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..