రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

|

Apr 25, 2024 | 8:04 PM

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు.

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి గ్రూప్‌ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ కంపెనీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్‌ సైజునే వాడారా? అంతే సైజులో క్షమాపణలను ప్రచురించారా? అని ప్రశ్నించింది. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేడు మరోసారి వార్తాపత్రికల్లో క్షమాపణలు తెలియజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం

అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!