Viral: 3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా కూడా చేస్తారా.!

Viral: 3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా కూడా చేస్తారా.!

Anil kumar poka

|

Updated on: Dec 27, 2024 | 4:14 PM

పెళ్లి పేరుతో అందిన కాడికి దోచుకుని పరారయ్యే ‘దోపిడీ పెళ్లి కూతురు’కు పోలీసులు సంకెళ్లు వేశారు. పెళ్లి చేసుకోవడం, ఆపై సెటిల్‌మెంట్ పేరుతో పెద్దమొత్తంలో దండుకునే నిందితురాలి ఆగడాలకు పదేళ్ల తర్వాత చెక్ పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి 2013లో తొలుత ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అనంతరం రూ. 75 లక్షలు వసూలు చేసి కేసును ఉపసంహరించుకుంది.

గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సీమా 2017లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఈ క్రమంలో రూ. 10 లక్షలు దండుకుంది. అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అనంతరం రూ.36 లక్షల విలువైన నగలు, నగదుతో ఉడాయించింది. ఆ కుటుంబం కేసు పెట్టడంతో నిందితురాలు సీమాను తాజాగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ‘లూటేరి దుల్హన్’ గా జైపూర్ పోలీసులు అభివర్ణించారు. విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన ధనవంతులైన మగవారిని మ్యాట్రిమోనియల్ సైట్‌లలో వెతికి వారిని టార్గెట్‌ చేస్తుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ముగ్గురిని పెళ్లాడిన సీమా వారి నుంచి రూ.1.25 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.