AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అటవీశాఖకు సవాలుగా మారిన చిరుత.. చిరుతను గుర్తించలేకపోతున్న సిబ్బంది.

Viral: అటవీశాఖకు సవాలుగా మారిన చిరుత.. చిరుతను గుర్తించలేకపోతున్న సిబ్బంది.

Anil kumar poka
|

Updated on: Oct 29, 2023 | 9:44 PM

Share

తిరుమలలో మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ బరిలోకి దిగింది. అలిపిరి నడకమార్గంలో లక్షితను చంపిన ప్రాంతంలోనే తిరుగుతోంది. అలిపిరి నడక మార్గంలో చిరుతల అలజడిపై కొనసాగుతున్న నిఘా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్టోబరు 24,25న నడకమార్గంలోని 7వ మైలునుంచి నరసింహస్వామి ఆలయం వరకూ చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు ట్రాప్ కెమెరా ఇమేజెస్ బయటపెట్టాయి.

తిరుమలలో మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ బరిలోకి దిగింది. అలిపిరి నడకమార్గంలో లక్షితను చంపిన ప్రాంతంలోనే తిరుగుతోంది. అలిపిరి నడక మార్గంలో చిరుతల అలజడిపై కొనసాగుతున్న నిఘా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్టోబరు 24,25న నడకమార్గంలోని 7వ మైలునుంచి నరసింహస్వామి ఆలయం వరకూ చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు ట్రాప్ కెమెరా ఇమేజెస్ బయటపెట్టాయి. నడకమార్గానికి అతి సమీపంగానే చిరుతలు సంచరిస్తున్నట్లు కెమెరాల్లో స్పష్టమైంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల లోపు చిరుతలు సంచరిస్తూ ట్రాక్ కెమెరాల్లో చాలా చోట్లనే కనిపించాయి. ఈ క్రమంలో టీటీడీ భక్తులను మరోసారి అప్రమత్తం చేసింది. నడక మార్గంలో వచ్చే భక్తులను తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు రెండు నడక మార్గాల్లో ఆంక్షలను యధావిధిగానే అమలు చేస్తుంది. అయితే ఆగస్టు 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను ఇప్పటిదాకా అటివిశాఖ గుర్తించలేక పోయింది. ఇప్పటివరకూ అటవీశాఖ బంధించిన 6 చిరుతల్లో ఒక చిరుతను తలకోన అటవీ ప్రాంతంలో మరో చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వరం అడివి ప్రాంతంలో వదిలిపెట్టిన అటవీశాఖ ఒక చిరుతను విశాఖ జూకు తరలించి విముక్తి కల్పించింది. ప్రస్తుతం తిరుపతి జూ లో ఉన్న మూడు చిరుతల్లో రెండు చిరుతలకు కోరపళ్లు లేకపోవడంతో జూ లో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. మరో చిరుత ను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే జూలో ఉన్న మూడు చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుత ఉందేమోనన్న అనుమానంతో నమూనాలు సేకరించి పరీక్షలకు పంపింది. ఇప్పటిదాకా రాని రిపోర్ట్ లుతో పరేషాన్ అవుతున్న అటవీశాఖ లక్షితపై దాడి చేసిన చిరుతను నిర్ధారించలేక పోతోంది. కాగా, గత వారం రోజులుగా నడకమార్గానికి దగ్గర్లోనే సంచరిస్తున్న చిరుతలు, ఎలుగుబంట్లు పై నిఘా పెంచిన అటవీశాఖ సిబ్బంది ట్రాప్ కెమెరాల్లో లభించిన ఇమేజెస్ ద్వారా చిరుతల కదలికలు గుర్తించే పనిలో ఉంది. ఆయా లొకేషన్లలో బోన్లు ఏర్పాటు చేసింది. నడక మార్గంలో చిరుతల సంచారం పై క్లోజ్ గా మానిటరింగ్ చేస్తోంది. నడకమార్గానికి ఇరువైపులా 200 వందల మీటర్ల దాకా నిఘా కొనసాగిస్తోంది. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కూడా హెచ్చరిస్తోంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాల్లో యధావిధిగానే ఆంక్షలను టీటీడీ అమలు చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..