AP News: కారు ఆపితే దూసుకుంటూ వెళ్లిపోయాడు.. ఛేజ్ చేసి ఆపి చెక్ చేయగా..
ఎన్నికల నేపథ్యంలో అధికారులు హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఒక కారు వచ్చింది. అధికారులు ఆపినా ఆగకుండా జోరుగా దూసుకుపోయింది. దీంతో ఛేజ్ చేసి.. వెంటాడి కారును ఆపారు. ఆ తర్వాత కారులో తనిఖీలు చేయగా....
నెల్లూరు జిల్లా కందుకూరు శివారులో అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. కందుకూరు శివారులోని ఆలవారిపాలెం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వాహిస్తున్నారు. అయితే.. తనిఖీ అధికారులను గమనించిన కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో.. సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ పట్టుకున్నారు అధికారులు. కారులో ఉన్న 700 బాటిళ్ల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక.. కారులో కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పేరుతో పోస్టర్లు ఉన్నాయి. ఇవాళ కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

