Telangana: బస్‌స్టాప్ వచ్చేలోపు 6 తులాల బంగారం మాయం.. కానీ.! అసలు డౌట్ ఇదే
ఆ మహిళ బస్సులో వెల్దుర్తి నుంచి నర్సాపూర్ బయల్దేరింది. బ్యాగులో ఆరు తులాల బంగారం తీసుకుని వెళ్లింది. ఇక గమ్యస్థలం వచ్చింది కదా అని.. దిగి తన బ్యాగ్‌లోని బంగారాన్ని చెక్ చేయగా.. మాయం అయినట్టు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మెదక్ జిల్లా భారీ చోరీ జరిగింది. నర్సాపూర్ బస్టాండ్‌లో అనసూయ అనే మహిళ వద్ద 6 తులాల బంగారం అపహరణకు గురైంది. వెల్దుర్తి నుంచి నర్సాపూర్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది అనసూయ. గమ్యస్థానం చేరుకోగానే బస్సు దిగిన అనంతరం బ్యాగులోని బంగారం చెక్ చేయగా.. చోరీకి గురైనట్టు గుర్తించింది సదరు మహిళ. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: May 11, 2025 08:30 AM