భూమిలోకి దిగబడ్డ 60 బైక్‌లు వీడియో
పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ గ్రామాలలో వరద కల్లోలం కొనసాగుతోంది. రావి నది పొంగి ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి మరో దెబ్బ తగిలింది. వర్షాలకు ఎగువన నీటి ప్రవాహంతో రావి నదికి వరద పోటెత్తింది. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికి అందివచ్చిన పంటలు పోయి వారు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు వారికి ఇంకో సమస్య వచ్చిపడింది.
ఈ ప్రాంతంలోని ఉస్ పార్ గ్రామ రైతులకు చెందిన దాదాపు 60 బైకులు భూమిలోకి దిగబడి పోయాయి. అది కూడా ఆరు నుంచి ఎనిమిది అడుగులు లోతులోకి వెళ్లిపోయాయి. తొలుత తమ బైకులు పార్క్ చేసిన ప్రాంతంలో అవి కనిపించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే కొన్ని బైకులకు భూమిలోకి చొచ్చుకు వెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో రైతులు బృందాలుగా ఏర్పడి.. వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దాదాపుగా ఆ ప్రాంతాలోని రైతులంతా తమ తమ వాహనాలను వెలికి తీసే పనిలో పడ్డారు. అందుకోసం వారంతా తవ్వకాలు చేపట్టారు. ఈ ఉస్ పార్.. ఏడు గ్రామాల సమూహం. ఈ గ్రామాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు ఉంటున్నారు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుకు అనుకుని ఉంది. అయితే తామంతా బ్యాంకు లోన్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేసామని అవి ఇప్పుడు పూర్తిగా డామేజ్ అయ్యాయని వాపోయారు. మరో వైపు పంట మొత్తం పోవడం.. అలాగే బైకులు సైతం ఇలా భూమిలో కూరుకు పోవడంతో ఆ రైతుల బాధ వర్ణించ లేనిదిగా మారింది. తీసుకున్న లోన్‌కు వడ్డి చెల్లించకుంటే.. మళ్లీ పంటకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండదని రైతులు వాపోయారు. వరదల కారణంగా తమ పశువులు సైతం మృతి చెందాయని కన్నీటి పర్యంతయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో
పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో
ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
